నార్పలకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి జగనన్న వ‌స‌తి దీవెన నగదును సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేయను­న్నారు. అంతకు ముందు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

Back to Top