ఒంగోలు పీవీఆర్‌ స్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం

సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలన

మరికాసేపట్లో ‘వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ’ నగదు విడుదల

ఒంగోలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలులోని పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలతో గ్రూప్‌ ఫొటో దిగారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది ‘వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ’ పథకం కింద రూ.1,261 కోట్లను మరికాసేపట్లో సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. ఆ సొమ్ము నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top