అనకాపల్లి చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన‌కాప‌ల్లి జిల్లా చేరుకున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అక్క‌డి నుంచి విశాఖ‌ప‌ట్నం బ‌య‌ల్దేరారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరి అనకాప‌ల్లి జిల్లా క‌శింపేట చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. క‌శింపేట నుంచి రోడ్డు మార్గంలో పిసినికాడ స‌భా ప్రాంగ‌ణానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌య‌ల్దేరారు. మ‌రికాసేప‌ట్లో వరుస‌గా నాలుగో ఏడాది అమ‌లు చేస్తున్న వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం నిధుల‌ను విడుద‌ల చేస్తారు. అంత‌కు ముందు రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మ‌ల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.

Back to Top