విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైయస్ఆర్ ’ అవార్డులు అందజేయనుంది. నేడు(నవంబర్1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్లో వైయస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైయస్ఆర్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్మెంట్, 4 ఎచీవ్మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లంభించనున్నాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు.