వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ 

ప్ర‌కాశం జిల్లా: ప్రకాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భా­గమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం వైయ‌స్‌ జగన్‌.. రెండో టన్నెల్‌ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించి వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైయ‌స్‌ జగన్‌ ప్రారంభోత్సవం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాలు పూర్తి చేయించారు. ఆసియాలోనే  అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్  నిలబెట్టుకున్నారు.

Back to Top