వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను చూసి గ‌ర్విస్తున్నా

ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శంసించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: `వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను చూసి గ‌ర్విస్తున్నా`న‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. వలంటీర్ల వ్య‌వ‌స్థ ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శంసించారు. అవినీతి ర‌హిత ప‌రిపాల‌న కోసం, అర్హత క‌లిగిన వారంద‌రికీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు వారి ఇంటి గుమ్మం ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను సంవ‌త్స‌రం క్రితం ఏర్పాటు చేశాం. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ల మేర‌కు అద్బుత‌మైన సేవ‌లందిస్తున్న వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను చూసి గ‌ర్విస్తున్నా` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top