లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: మూడు నెలల పాలనలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెలే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకొని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడని, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశాడని మండిపడ్డారు. నిరుద్యోగులను వంచించిన చంద్రబాబుకు సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఐదేళ్లలో ఒక్క నిరుద్యోగికి అయినా చంద్రబాబు అండగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంచి పేరు కావడం వల్లే చంద్రబాబు విమర్శిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు రూ. కోట్లలో ఇసుక దోపిడీ చేశారని, గత పాలకుల ఇసుక దోపిడీతోనే ఇప్పుడు ఇసుక కొరత ఏర్పడిందన్నారు. హరికృష్ణ, కోడెల శివప్రసాదరావుల మరణాలను చంద్రబాబు తన నీచ రాజకీయాలకు వాడుకున్నాడన్నారు.  
 

Back to Top