కేంద్ర విదేశాంగ మంత్రికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌

తాడేపల్లి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావాల‌ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంక‌ర్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ కోరారు. ఈ మేర‌కు కేంద్ర విదేశాంగ మంత్రితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థులను సుర‌క్షితంగా తీసుకువ‌చ్చేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్రప్ర‌భుత్వం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని కేంద్ర‌మంత్రి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివరించారు. ఉక్రెయిన్ నుంచి పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా స్వ‌దేశానికి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటామని వివ‌రించారు. 

తాజా వీడియోలు

Back to Top