కైకాల కుమారుడికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌

తాడేప‌ల్లి: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య ప‌రిస్థితిపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆరా తీశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం భ‌రోసా ఇచ్చారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

తాజా ఫోటోలు

Back to Top