తెలుగు మత్స్యకారులను ఆదుకోండి

గుజరాత్ సీఎం‌కు వైయస్ జగన్ ఫోన్..
 

తాడేపల్లి : గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ రూపానీకి ఫోన్ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని వైయస్‌ జగన్ కోరారు. ఇందుకు గుజరాత్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

అసోం సీఎంకు ఫోన్..
ఇటీవలే.. అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌‌కు సీఎం వైయస్‌ జగన్ ఫోన్ చేశారు. ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని వైయస్‌ జగన్ గుర్తు చేశారు. అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం వైయస్‌ జగన్ కోరారు. అలాగే చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన అసోం సీఎం.. తగు చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎంకు హామీ ఇచ్చిన విషయం విధితమే. సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తాజా వీడియోలు

Back to Top