బాబు జగ్జీవన్‌రామ్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: అట్టడుగు వర్గాల అభ్యున్నత, అణగారిన ప్రజల హక్కుల కోసం బాబు జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్‌ 113వ జయంతి సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళులర్పించారు. "అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి" అంటూ సీఎం ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top