ఈసీ గంగిరెడ్డికి సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

వైయస్‌ఆర్‌ ఆడిటోరియంలో సంస్మరణ సభ

పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు

పులివెందుల: డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి సంస్మరణలో సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల భాకారాపురంలోని వైయస్‌ఆర్‌ ఆడిటోరియంలో కొనసాగుతున్న సంస్మరణ సభలో పాల్గొని తన మామ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్మరణ సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, సీఎం వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదే విధంగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు, ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులూ సంస్మరణ సభలో పాల్గొని ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించారు. 
 

Back to Top