న‌వ భార‌త వికాసానికి బాట‌లు వేసిన దార్శ‌నికుడు అంబేద్క‌ర్‌

అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి:  న‌వ భార‌త వికాసానికి బాట‌లు వేసిన దార్శ‌నికుడు అంబేద్క‌ర్ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన అంబేద్క‌ర్ 130వ జ‌యంతి కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొని అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు మేక‌తోటి సుచ‌రిత‌, తానేటి వ‌నిత‌, విశ్వ‌రూప్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగాం సురేష్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌ర్వ‌స‌మాన‌త్వానికి కృషి చేసిన కార‌ణ‌జ‌న్ముడు అంబేద్క‌ర్ అన్నారు. అత్యుత్త‌మ‌మైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్న‌తుడు అని కొనియాడారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా నిండుమ‌న‌సుతో నివాళి అర్పిస్తున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top