మ‌హానేత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

వైయ‌స్ఆర్‌ జిల్లా : దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ఉద‌యం ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. తన తండ్రి, దివంగత మహానేత వైయ‌స్ఆర్‌  ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. అంతకుముందు వైయ‌స్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయ‌స్‌  విజయమ్మ వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ సతీమణి వైయ‌స్‌ భారతి, సోదరి వైయ‌స్‌ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు కూడా వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top