ప్ర‌తి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోంది

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సీఎం వైయ‌స్ జగన్

 తాడేప‌ల్లి:  ప్ర‌తి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు క‌నిపిస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సీఎం శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. గ‌డ‌ప గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మంతో ప్ర‌భుత్వాన్ని మ‌నం ప్ర‌తి వార్డులోకి తీసుకెళ్తున్నాం. ప్ర‌తి ఇంటి వ‌ద్ద‌కు తీసుకెళ్తున్నాం. ఇందులో మీ అంద‌రి భాగ‌స్వామ్యం అవ‌స‌రం. పార‌ద‌ర్శ‌కంగా, వివ‌క్ష‌తకు తాపులేకుండా, లంచాలు లేకుండా  ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఇంటి వ‌ద్ద‌కు తీసుకెళ్తున్నాం. పార‌ద‌ర్శ‌కంగా పాల‌న సాగుతోంది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా గొప్ప వ్య‌వ‌స్థ‌ను తీసుకురాగ‌లిగాం. దేవుడి ద‌య‌తో మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి హామీని నెర‌వేర్చాం. 98 శాతం హామీల‌ను నెర‌వేర్చిన త‌రువాత‌ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నాం. ప్ర‌జ‌ల ఆశీస్సులు కోరుతున్నాం. ఇటువంటి ప‌రిస్థితుల్లో 175కు 175 సీట్లు ఎందుకు రాకూడ‌ద‌ను అనే టార్గెట్‌తో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ టార్గెట్ సాధ్యం కాని ప‌ని కాదు. ప్ర‌తి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి క‌నిపిస్తోంది.. ప్ర‌తి ఇంటికి మేలు జ‌రుగుతుందని, 175 స్థానాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అంద‌రూ ఐక్య‌మ‌త్యంతో ప‌ని చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top