రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం

నీతిఆయోగ్ స‌ద‌స్సులో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన సదస్సులో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నీతి ఆయోగ్ స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్ కె. ఎస్‌. జవహర్‌ రెడ్డి, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్‌. హరి కిరణ్‌‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని,  ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)ల ద్వారా అందిస్తున్నామ‌ని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాల‌ని, నేచురల్‌ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీకేలపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. 

Back to Top