శ్రీ‌శార‌దా పీఠం వార్షికోత్స‌వంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

శ్రీ రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు

వేద విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్లు, మెడ‌ల్స్‌ అంద‌జేత‌

విశాఖ‌ప‌ట్నం: శ్రీ శారదా పీఠం వార్షిక మ‌హోత్స‌వాల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌రాజ‌శ్యామ‌లాదేవికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలాదేవి యాగంలో మహా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిల‌తో క‌లిసి పాల్గొన్నారు. విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌తో సంకల్పం చేయించారు. సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. పీఠంలో కొలువుదీరిన శివ‌లింగానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభిషేకం చేశారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు, డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, మంత్రులు వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీ‌నివాస్ త‌దిత‌రులు ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top