ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జగన్

తాడేప‌ల్లి: జాతీయ విద్యావిధానం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఐటీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top