ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం

తాడేపల్లి: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం.. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. కోవిడ్‌–19 నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యాక్సినేషన్‌ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై ఈ సమావేశంలో చర్చించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top