సామూహిక గృహ ప్ర‌వేశాల్లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కాకినాడ‌: సామ‌ర్ల‌కోట‌లో సామూహిక గృహ ప్ర‌వేశ మ‌హోత్స‌వంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. నిరుపేద‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేస్తూ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేప‌డుతోంది. సామ‌ర్ల‌కోట‌లో పూర్త‌యిన వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీల్లోని నూత‌న గృహాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. పేద అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇళ్ల‌ను అందించారు. ప్ర‌భుత్వం నిర్మించిన ఇళ్ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. ఆ ఇంటి య‌జ‌మానుల‌తో ముచ్చ‌టించారు. అనంత‌రం వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీని ప‌రిశీలించారు. కాల‌నీలో ఏర్పాటు చేసిన దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి నివాళుల‌ర్పించారు. మ‌రికాసేప‌ట్లో సామర్ల‌కోట ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. అంత‌కుముందు సామర్ల‌కోట‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేత‌లు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 

Back to Top