లలితమ్మ అంతిమసంస్కార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి లలితమ్మ అంతిమసంస్కార కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. బనగానపల్లి సభ అనంతరం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో  ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు సీతారామిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Back to Top