మహానేతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

పులివెందుల : వైయస్‌ఆర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పులివెందుల నియోజకవ‌ర్గం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఘాట్‌ సమీపంలోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,  కడప మేయర్ సురేష్ బాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Back to Top