మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

వలస కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చాలని ఆదేశాలు జారీ

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయంపై వలస కూలీల హర్షం

 

తాడేపల్లి:  బీహార్, ఒడిస్తా, ఛత్తీస్‌ఘడ్‌లకు కాలినడకన వెళ్తున్న వలసకూలీల వెతలు చూసి చలించిపోయారు ఏపీ సీఎం వైయస్ జగన్. తెలంగాణా నుంచి బయలుదేరి ఏపీ మీదుగా వివిధరాష్ట్రాలకు వెళ్తున్న వారికి మానవతా దృక్పథంతో సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వారికి ఆహారం, నీరు అందించి సహాయక కేంద్రాలకు పంపించమని సూచించారు. అయితే వారంతా స్వస్థలాలకు వెళ్లాలనే అనుకుంటున్నారని తెలుసుకుని ఆ రాష్ట్రాల అధికారులతో మాట్లాడి పంపించే ఏర్పాట్లు చేయమని తెలిపారు. 
ఏపీలో ఉన్న వలస కూలీలకు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, స్వంత ఊళ్లకు వెళతామన్న వారికి మెడికల్ టెస్టులు చేసి మరీ రైలు, బస్సుల్లో సురక్షితంగా పంపింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణా నుంచి ఏపీ మీదుగా వెళుతున్న వలస కూలీలకు కూడా సాయం అందిస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు వైయస్ జగన్. వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 
అటు సొంత రాష్ట్రాలు, ఇటు పనులకు వలస వచ్చిన రాష్ట్రాలు పట్టించుకోకపోతే ఏ సంబంధం లేని ఏపీ ప్రభుత్వం మాత్రం వారి కష్టాలకు స్పందించింది. క్షేమంగా వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. 
గొప్ప నాయకుడు కావాలంటే కావాల్సింది పెద్ద బలగం కాదు...పెద్ద మనసు అని నిరూపించారు వైయస్ జగన్. సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇక్కడి ప్రజలు చేసుకున్న పుణ్యమని కొనియాడారు.

తాజా వీడియోలు

Back to Top