స్కూల్‌ యూనిఫామ్స్‌ సరఫరాలో టీడీపీ అవినీతి

విచారణకు ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌
 

అమరావతి: విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్‌ యూనిఫామ్స్‌లో కూడా గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆప్కో పేరుతో యూనిఫామ్స్‌ సరఫరాలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి బాగోతాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్‌ యూనిఫామ్స్‌ అవకతవకలపై సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో యూనిఫామ్స్‌ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచేసరికే యూనిఫామ్స్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Back to Top