డిసెంబర్‌ 31 కల్లా చెక్‌పోస్టులు పూర్తిస్థాయిలో పనిచేయాలి

అధికారులను ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబర్‌ 31వ తేదీ నాటికల్లా అన్ని జిల్లాల్లో చెక్‌పోస్టులు పూర్తిస్థాయిలో పనిచేయాలని సూచించారు. గనులు, పంచాయతీ రాజ్, పోలీసు శాఖలకు సహకరించాలని కలెక్టర్లను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు. మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ గతంలోనే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top