అమరావతి: మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.