తాడేపల్ఇ: మన జాతీయ పతాక రూపశిల్పి..పోరాట యోధుడు పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.ఇవాళ పింగళివెంకయ్య వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వెంకయ్య చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు.ప్రతి భారతీయుడు గర్వపడేలా జాతీయ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.