సిరివెన్నెల మరణం తెలుగువారికి తీరనిలోటు

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతికి సంతాపం తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని, అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం తెలుగు వారికి తీరని లోటు అని సీఎం అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top