వైయస్‌ఆర్‌ జిల్లాకు బయల్దేరిన సీఎం 

కాసేపట్లో కడప ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా పర్యాటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వైయస్‌ఆర్‌ జిల్లాకు బయల్దేరారు. కాసేపట్లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌కు 4.55 గంటలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడు రోజుల పాటు వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముద్దనూరు రోడ్డులో ఇమ్రా ఏపీకి శంకుస్థాపన చేస్తారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఏపీ కార్ల్‌ భవనాల నిర్మాణం, ఇండ్రస్టియల్‌ డెవలప్‌మెంట్‌ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా తొండూరు బాలికల బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు. 
 

Back to Top