లంచం లేదు..వివక్ష లేదు

అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కోవిడ్‌ వారియర్స్‌ అందరికీ హ్యాట్రాఫ్‌

ఈ 14 నెలల్లో కరోనాపై రూ.2229 కోట్లు ఖర్చు చేశాం

ఏపీలో 53 ఆసుపత్రుల్లో ఆక్సీజన్‌ తయారీ ప్లాంట్లు పెడుతున్నాం

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం 17 ఆసుపత్రులను నోటిఫై చేశాం

దేశవ్యాప్తంగా 11 శాతం మందికి మాత్రమే వ్యాక్సీన్‌ ఇచ్చారు

దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే 170 కోట్ల డోసులు కావాలి

కరోనా వల్ల అనాధలైన పిల్లల పేరుతో రూ.10 లక్షల డిపాజిట్‌ చేస్తాం

తప్పుడు వార్తలతో ఆడే గుండెలను ఆపొద్దని కోరుతున్నా

విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు తోడుగా ఉంటున్నాం

దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాలి

నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం

నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు

కుల, మత, ప్రాంత, రాజకీయాలు చూడకుండా సంక్షేమం అందించాం

కుట్రలు పన్ని గోడలపై ఉన్ను రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారు

అమరావతి: సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా కూడా లంచం లేదు..వివక్ష లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించామని తెలిపారు. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందిచామని చెప్పారు. మొత్తం రూ.లక్షా 25 వేల కోట్లు ప్రజలకు చేరవేశామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచామని చెప్పారు. ప్రజలన్ని భయపెట్టే వార్తలు వేయోద్దని ఎల్లోమీడియాను కోరారు. మేనిఫెస్టో వాగ్ధానాల్లో 94.5 శాతం పూర్తి చేశామని చెప్పారు. గురువారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు.

రెండేళ్ల పాలనలో ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా అడుగులు వేశామని రెండేళ్ల తరువాత గర్వంగా చెబుతున్నాను. పెద్దలు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ గారికి నా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు.
కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి శ్రద్ధాంజలి పాటిస్తూ..రెండు నిమిషాలు మౌనం పాటించాలని మీ ద్వారా కోరుతున్నాను.

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు. దివంగత నేత , మహానేత వైయస్‌ఆర్‌ చనిపోయిన సందర్భంలో అనేక మంది చనిపోయారు. వారి వద్దకు వెళ్లి ఓదార్చాను. ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. ప్రాణం విలువ తెలుసు కాబట్టే..అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు తీసుకువచ్చాను. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి. ఇది ప్రాణం పోసే స్కీమ్‌గా ఉండాలని రాష్ట్రంలో రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం చేశాను. దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వెయ్యి జబ్బులకు మాత్రమే చికిత్సలు చేసేవారు. దాన్ని 2400 జబ్బులకు వర్తింపజేశాం.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఆలోచన చేయలేదు. ఏకంగా 1180 వాహనాలు, 108, 104 వాహనాలు ఏర్పాటు చేసి 20 నిమిషాల్లో అందుబాటులోకి తెచ్చాం. బెంజి సర్కిల్‌ నుంచి కుయ్‌ కుయ్‌ అంటూ ప్రతి మండలానికి పంపించాం.
మనం ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 2 వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశాం. ఈ రోజు మన ప్రతి గ్రామంలోనూ, మన కళ్ల ఎదుటే వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ కట్టబడుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తి అయితే దాదాపుగా 91 రకాల మందులు అందుబాటులో ఉంటాయి,. 24 గంటలు ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక 108 వాహనం అందుబాటులో ఉంటుంది. 

ప్రపంచానికి కోవిడ్‌ పెద్ద సవాల్‌ను విసిరింది. మన రాష్ట్రంలో మార్చిలో తొలి నాళ్లలో టెస్టులు చేయించేందుకు ఏకంగా పుణేకు పంపించాల్సి వచ్చేది. ఈ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో 150కి పైగా ల్యాబ్‌లు నడుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో లక్ష టెస్టులు పైగా చేస్తున్నాం. మొదటి కోవిడ్‌ దశలో 261 ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తే, 649 ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తరువాత మనకు కేవన్‌ సీటీలు లేకపోయాయి. మంచి ఆసుపత్రులు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అక్కడే అందుబాటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక టీచింగ్‌ కం నర్సింగ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఉంటేనే పేదలకు మెరుగైన వైద్యం అందించగలమనే తపనతో అడుగులు వేస్తున్నాం. ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని కోవిడ్‌ వైద్యసేవలు అందిస్తున్నాం. వాటి బాధ్యతను పూర్తిగా ప్రభుత్వ భుజస్కందాలపై వేసుకుంది. అక్కడ మందులు, సిబ్బందిని ఏర్పాటు చేయడం మంచి వైద్యం అందిస్తున్నాం. గత సెప్టెంబర్‌లో మనం తీసుకున్న ఆసుపత్రుల్లో 261లో 37441 బెడ్లు అందుబాటులో ఉంచాం.

ఈ రోజు 46 వేలకు పైగా బెడ్లు ఏర్పాటు చేశాం. ఇవి కాక కోవిడ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మరో 58471 బెడ్లు అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మెడికల్‌ కేర్‌ను ఇంప్రూవ్‌ చేసేందుకు అక్సిజన్‌ కాన్‌సంట్రేషన్‌లు ఏర్పాటు చేశాం. కోవిడ్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నది మన రాష్ట్రమే అని గ ర్వంగా చెప్పగలను. ప్రతి రోజు 25 వేల మంది ఉచితంగా కోవిడ్‌ రోగులు వైద్యం అందిస్తున్నాం. కోవిడ్‌ సమయంలో అక్షరాల రూ.2249 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెప్పగలను. కొత్తగా బ్లాక్‌ పంగస్‌ వస్తుందని తెలిసిన వెంటనే ..దాన్ని కూడా వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. దీని కోసం 17 ఆసుపత్రులను ఈ నెల 18న నోటిఫై చేశాం. 

ప్రతి అడుగులోనూ కోవిడ్‌పై యుద్ధం చేసే సమయంలో ఆసుపత్రులæ నిర్వాహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. అక్కడ స్పెషలిస్టులను, డాక్టర్లను 18200 మందిని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాం. ఈ రోజు 104 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఏకంగా ఏం కావాలన్నా కూడా కోవిడ్‌కు సంబంధించి సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి 3 లక్షల కాల్స్‌ వచ్చాయి. వీరిలో 60334 మందికి ఆసుపత్రుల్లో అడ్మిషన్లు ఇప్పించగలిగాం. మిగిలిన వారికి పరీక్షలు కూడా చేయించాం. ప్రత్యేకంగా సలహాలు ఇచ్చేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఇంట్లో ఉంటున్న వారికి అడ్వైజ్‌ చేస్తున్నాం. 3991 మంది డాక్టర్లు టెలీ వైద్యం కోసం ఉపయోగపడుతున్నారు. 

ఇబ్బందులు రాకుండా జిల్లాల్లోనే  అక్సిజన్‌ సెల్స్‌ కూడా ఏర్పాటు చేశాం. నీళ్లు కోనే రోజులు చూస్తున్నాం. కానీ వాయువు కూడా కొనే రోజులు వచ్చాయి. ఏకంగా విమానాల్లో ఆక్సిజన్‌ను తెప్పించాల్సి వస్తోంది. ప్రతి రోజు మిగతా రాష్ట్రాలతో కో–ఆర్డినేట్‌ చేసి అక్సిజన్‌ తెప్పిస్తున్నాం. ఓరిస్సా నుంచి ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం.  అన్ని ఆసుపత్రుల్లో 52 ఆక్సిజన్‌ ప్లాంట్లు పెడుతున్నాం. మరో 50 ప్రైవేట్‌ ట్యాంకర్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశాం. కోవిడ్‌ కేర్‌లో ఉన్న వారికి అక్సిజన్‌ కాన్‌సంట్రేషన్లు ఏర్పాటు చేశాం. ఇన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ల నుంచి కలెక్టర్ల వరకు కష్టపడటంతో అతి తక్కువ మరణాలున్న రాష్ట్రాల్లో మనం కూడా ఉన్నాం. మన వద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు లేవు. వేగంగా వైరస్‌ను గుర్తించి, చికిత్స అందించడంతోనే ఇది సాధ్యమైందని గర్వంగా చెబుతున్నాను. అందరికి అభినందనలు తెలుపుతున్నాను.

వ్యాక్సీనేషన్‌ గురించి సగటు ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇటీల వ్యాక్సీనేషన్‌పై వక్రీకరిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ అన్నది ఈ రోజు దేశంలో జనాభా 45 ఏళ్లు పైబడిన వారు 26 కోట్ల మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. 52 కోట్ల డోసులు వాళ్లకే కావాలి. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు 60 కోట్లు మంది ఉన్నారు. వారికి 120 కోట్ల డోసులు కావాలి. దాదాపుగా 170 కోట్లు అవసరమవుతాయి. మన దేశంలో వ్యాక్సిన్‌ మేనిఫెచరింగ్‌ కేవలం 7 కోట్లు మాత్రమే. ఇందులో 6 కోట్లు సీరం ఇనిస్ట్యూట్‌ తయారు చేస్తే, భారత్‌ బయోటెక్‌ వారు మిగిలినవి తయారు చేస్తున్నారు. 172 కోట్ల డోసులు అవసరం కాగా కేవలం 18.44 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. 11 శాతం కూడా ఇంతవరకు వ్యాక్సినేషన్‌ చేయలేదు.
మన రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారు 1.48 కోట్లు మంది. 45 ఏళ్లలోపు మరో రెండు కోట్ల మంది ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేయాలంటే 7 కోట్లు డోసులు అవసరం. కేంద్రం ఇప్పటి వరకు 76 లక్షలు మాత్రమే. ఇదీ రాష్ట్రం, దేశం పరిస్థితి. వాస్తవాలను వక్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లందరికీ ఈ పరిస్థితి తెలుసు. ఇదే రామోజీ రావు కొడుకు వియ్యంకుడి భారత్‌ బయోటెక్‌ సంస్థ అధినేత. ఆయనకు తెలియదా? పరిస్థితి. వీళ్లు చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలు వింటే మనసుకు బాధనిపిస్తుంది. 

మన ప్రభుత్వం వ్యాక్సిన్‌ కోసం ముందుగానే గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. మనం కోవిడ్‌ను బయటపడేందుకు వ్యాక్సినే ఏకైక మార్గం. వ్యాక్సినేషన్‌ జరిగేదాకా కోవిడ్‌తో కలిసి బతకాల్సిందే. మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాక్సిన్‌ ఎలాగైనా తెస్తాం. ప్రజలందరికీ ఉచితంగా వేస్తాం. కోవిడ్‌కు సంబంధించి మందులు, ఆక్సిజన్‌ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తాం. వాస్తవాలు తెలిసి కూడా అబద్ధాలు చెబుతూ నిందలు వేస్తే ఎవరూ ఏమి చేయలేరు. వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే..ప్రభుత్వం వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేస్తామని ఆశీస్తున్నాం.

45ఏళ్లు పైబడిన వారికి ముందుకు వ్యాక్సిన్‌ ఇస్తే ఉపయోగపడుతుంది.  మొదటి ప్రాధాన్యత 45 ఏళ్లు పైబడిన వారికే. మిగిలిన వారికి కూడా కచ్చితంగా వ్యాక్సిన్‌ వేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాను.  

ప్రాణం విలువ తెలుసు కాబట్టే..చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం. ఒక్కోసారి బాధనిపిస్తుంది. మరణాలను నివారించలేకపోయామని..తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను చూస్తే బాధనిపిస్తుంది. మనసుకు కష్టమనిపించి అలాంటి పిల్లల కోసం రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ వడ్డీతోనైనా ఆ పిల్లలు బతుకుతారని భావిస్తున్నాను. 

ఇవాళ మన పరిస్థితి ఏంటి ..మన వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఏంటి అన్నది దేశానికి అర్థమయ్యేలా చెప్పాం. వ్యాక్సినేషన్‌ సందర్భంగా కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించాం. దేశానికి మన కేపాసిటి చూపించాం. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసే సత్తా మాకుందని ప్రధానికి లేఖలు రాశాం. 
చంద్రబాబు, ఎల్లోమీడియా ఏకరంగా ఆరోపణలు చేస్తున్నాయో చూస్తున్నాం. ఇదే మాదిరిగా మనం కూడా చేయవచ్చు. కానీ కోవిడ్‌ సమయంలో ఎవరిమీదనో వేలెత్తి చూపించకూడదు. తప్పులు ఎక్కడ జరిగినా కూడా వెలెత్తి చూపితే ఏం సాధించగలం. అందరం కూడా మనషులమే. ఒకరిని ఒకరూ ప్రోత్సహించడం నేర్చుకోవాలి. మనం ఏరకంగా బీహెవ్‌ చేస్తామో దేశం మొత్తం చూస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న ఎల్లోమీడియా, ప్రతిపక్షాన్ని ఇద్దరిని కూడా రిక్వెస్ట్‌ చేస్తున్నాం. ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే అపోహాలు, అసత్యాలు ప్రసారం చేసి ప్రజల్లో భయాన్ని క్రియేట్‌ చేయడం సరికాదు.

2019 వరకు రాజకీయాలు, మేనిఫెస్టో అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేసేవారు. నేను మాత్రం గర్వంగా చెప్పగలను. నిజాయితీతో,చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నాను. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి పాలన సాగిస్తున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన వాటిన్ని 94.5 శాతం పూర్తి చేశానని గర్వంగా చెప్పగలను. వాళ్ల మాదిరిగా 40 ఏళ్ల అనుభవం ఉండకపోవచ్చు. వాళ్ల మాదిరిగా ఎల్లో మీడియా ఉండకపోవచ్చు. ఈ 24 నెలల పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకూండా, చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలు అందించాను. 
మంచి జరిగించేందుకు ప్రతి అడుగులోను మంచిగా ఆలోచన చేశాను. రాబోయే తరాలకు అభివృద్ధి అందేలా పాలిస్తున్నాం. అభివృద్ధి అంటే నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అనరు. రేపు బాగుంటేనే అభివృద్ధి అంటారు. రాబోయే తరం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోని శిథిలావస్థలో ఉన్న వ్యవస్థను మార్పు చేయడం అభివృద్ధి అంటారు. మన పిల్లలకు ఇంగ్లీష్‌ రాకపోతే ప్రపంచంతో పోటీ పడలేమని తెలిసి ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేస్తున్నాం. నాడు–నేడు, గోరుముద్ద పథకాలతో విజ్ఞానరంగాన్ని రూపురేఖలు మార్చుతున్నాం. అమ్మ ఒడి, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాం. దేశంలో కనివినీ ఎరుగని రీతిలో మహిళా సాధికారతపై దృష్టి పెట్టానని సగర్వంగా చెప్పగలను. అమ్మ  ఒడి, వైయస్‌ఆర్‌ ఆసరా, సున్నా వడ్డీ, ఇళ్లు కట్టించే కార్యక్రమం, 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించాం. ప్రతి అక్కాచెల్లెమ్మ అభివృద్ధి చెందేందుకు ఇవన్నీ చేశాం. లంచాలు, రెకమెండేషన్‌లు పెట్టినా కాళ్లు అరిగేలా తిరిగినా పని కాని పరిస్థితుల్లో అదే గ్రామంలో ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా పథకాలు పొందడమే అభివృద్ధి అంటారు.

 గ్రామ స్వరాజ్యాన్నికి అర్థం చెప్పేలా గ్రామ సచివాలయ వ్యవస్థను, వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. లంచం లేదు..వివక్ష లేదు. నేరుగా లబ్ధిదారుల వద్దకే సంక్షేమ పథకాలు అందించాం.

62 శాతం వ్యవసాయంపై బతుకుతున్నారు. ఆ జనాభా ఎలా బతుకుతున్నారు. వాళ్ల బతుకులు మార్చకుండా బిల్డింగ్‌లు కట్టిస్తే ఏం అభివృద్ధి. విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు తోడుగా ఉండేందుకు ఆర్‌బీకే వ్యవస్థను ఏర్పాటు చేశాం. కల్తీ లేని విత్తనం, మందులు అందిస్తున్నాం. 

సర్పంచ్, మున్సిపల్‌ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికల్లో దేవుడి దయతో ఒకే  ఒక జెండా ఎగిరింది. అది వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే. జనం గుండెల్లో నిలిచిపోయాం. అందుకే ప్రతిపక్షాలకు ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మొహం చెల్లడం లేదు. గతంలో సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తారో..తెలియదు. ఈ రోజు ఆ పరిస్థితిని మార్చాం. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తున్నామో క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేసి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అర్హులందరికీ ఈ పథకాలు అందుతున్నాయి. 

బడ్జెట్‌ సందర్భంగా ఈ ఏడాది అమలు చేసే పథకాల వివరాలు తెలియజేస్తున్నాను. వైయస్‌ జగన్‌ చెప్పారంటే కచ్చితంగా చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు,

ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన

మే మాసంలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా మొదటి విడత రూ.7500, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా సొమ్ము ఇచ్చాం. 25న వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందజేస్తాం.

జూన్‌లో వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలు అందజేస్తాం.

జులై జగనన్న విద్యా దీవెన, వైయస్‌ఆర్‌ కాపు నేస్తం, విద్యా కానుక,

ఆగస్టులో సున్నా వడ్డీ, ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు, ఆగ్రిగోల్డు బాధితులకు చెల్లింపులు

సెప్టెంబర్‌లో వైయస్‌ఆర్‌ ఆసరా

అక్టోబర్‌లో రైతుభరోసా, జగనన్న దీవెన

నవంబర్‌లో అగ్రవర్ణాలకు చెందిన అక్కల కోసం వైయస్‌ఆర్‌ చేయూత

డిసెంబర్‌లో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, వైయస్‌ఆర్‌ లా నేస్తం,

జనవరిలో అమ్మ ఒడి, పింఛన్‌ రూ.2,250 నుంచి 2,500కు పెంపు, వైయస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత

ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత చెల్లింపులు చేస్తాం.

ఇవి కాకుండా రెగ్యులర్‌గా అమలు చేసే పథకాలు ఎక్కడా కూడా ఆపకుండా అమలు చేస్తాం. రెండేళ్ల పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు , పేద మధ్య తరగతి వర్గాల కోసం గట్టిగా నిలబడ్డామని గర్వంగా చెప్పగలను. బీసీలు అంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని నిరూపించాం. పేద వర్గాలకు సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా ఈ 23 నెలల కాలంలో రూ.93708 కోట్లు కేవలం బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదు..రాజకీయాలు అసలే లేవు. మరో రూ.32 వేల కోట్లు అందజేశాం. ప్రజలకు నేరుగా డబ్బులు అందించాం. 

అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలు, చదువుకునే పిల్లలకు అందించి ఈ డబ్బు. అనుకోకుండా వచ్చిన కోవిడ్‌ సమయంలో నూ లబ్ధిదారులకు సంక్షేమం అందించాం. చీకటి శక్తులను చెంపపెట్టులా సంక్షేమ పథకాలు అమలు చేశాం. అందుకే ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ నాకు మద్దతుగా నిలిచారు. ఈ అన్ని కూడా మా విజయాలు అని చెప్పుకోవాలి. ఎదిగేకొద్ది ఒదగాలి. మనం ప్రజలకు సేవలకుం మాత్రమే. ఇదే గుర్తు పెట్టుకొని పని చేయాలి. నేను కూడా కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

Back to Top