మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే  

మ‌ద‌న‌ప‌ల్లె బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

జ‌గ‌న‌న్న విద్యా దీవెన కింద 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జ‌మ‌

 పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైయ‌స్ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు

ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భరోసా

మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాడు

రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నాం

 మీ బిడ్డ పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడు లేడు 

 మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు. 

మిమ్మల్ని, దేవుడ్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు

 అప్పటి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి

దుష్టచతుష్టయం మాటలు నమ్మొద్దు

మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి

 అన్న‌మ‌య్య జిల్లా: మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా... మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లిదండ్రుల‌కు హామీ ఇచ్చారు.  పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చామ‌ని చెప్పారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించామ‌న్నారు.  అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో ఇవాళ జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌ట‌న్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.  

 • దేవుడి దయతో మన అందరి ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం..మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకు సరిగ్గా మూడున్నర సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మీలో ఒకడిగా, మీ వాడిగా, ఈ రోజు నాతో సమయం పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నిండు మనసుతో రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 • పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైన  ఉందంటే అది చదువులు. ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలన్నా, ఆ కుటుంబం తలరాతలు మారాలంటే చదువు అనే అస్త్రం ఆ కుటుంబంలోనికి వచ్చినప్పుడే సాధ్యం. 
 • తమ కుటుంబాలు పేదరికం కారణంగా ఏ ఒక్కరైనా దూరం కాకూడదన్న మంచి ఆలోచనతో, మంచి మనసుతో, సామాజిక బాధ్యతతో అప్పట్లో దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డిగారు మొట్ట మొదటి సారిగా దేశంలో కనివినీ ఎరుగని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రతి పేదవాడి జీవిత చరిత్రను మార్చాలని వైయస్‌ఆర్‌ తపన పడ్డారు. అలాంటి గొప్ప పథకాన్ని ఆ తరువాత వ చ్చిన ప్రభుత్వాలు నీరుగార్చాయి. చివరికి అరకొరగా ఫీజులు ఇస్తూ..అది కూడా సంవత్సరాలు తరబడి బకాయిలు పెట్టి నీరు గార్చారు. అలాంటి పరిస్థితులు నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. చెప్పిన గాథలను నా చెవులారా విన్నాను. ఆ రోజు నేను అన్నాను..నేను విన్నాను..నేను ఉన్నానని ఆరోజు చెప్పిన మాటలు నాకు గుర్తు ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిస్థితులు మార్చే అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన పథకం తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే బాధ్యత మీ అన్న ప్రభుత్వం తీసుకుంది. మూడున్నర సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. 
 • ఈ పథకంతో పాటు వసతి ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తూ ఆ పిల్లాడికి మేలు జరిగేలా జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకువచ్చాం.
 • ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డా కూడా పోటీ ప్రపంచంలో నిలవాలని విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకువచ్చాం. ఇందులో భాగంగానే ఈ రోజు ఫీజూ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పేద విద్యార్థులు ఒక హక్కుగా పొందే విధంగా అడుగులు వేస్తున్నాం.
 • గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2017–2018 బకాయిలను రూ.1719 కోట్ల బకాయిలను సైతం మనందరి ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి ఈ మూడున్నర పాలనలోనే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రూ.9052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ. 3349 కోట్లు పిల్లల చదువులకు ఖర్చు చేశాం. 
 • చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే తీర్చింది. ఈ మూడున్నరేళ్ల పాలనలో ఈ రెండు పథకాలకు అక్షరాల రూ.12401 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. మీ బిడ్డగా , మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తున్నాను.
 • ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గత త్రైమాసికంకు సంబంధించిన జగనన్న విద్యా దీవెన డబ్బులు 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా రూ.694 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నానని సగర్వంగా తెలియజేస్తున్నాను.
 • సంస్కరణల్లో భాగంగా మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తూ కాలేజీల్లో జవాబుదారితనం పెరిగేలా, వసతులపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నిస్తూ, వసతులను పర్యవేక్షించేలా నేరుగా ఆ డబ్బులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 
 • తల్లుల సాధికారతకు పట్టం కడుతూ..ఆర్థికసాయం నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ గొప్ప సంస్కరణకు నాందీ పలికాం.
 • పిల్లలు చదవాలి. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం పెట్టిది ఖర్చుగా భావించడం లేదు. దాన్ని ఆస్తిగా భావిస్తాను. ప్రతి చిట్టి చెల్లి, తమ్ముడికి చెబుతున్నాను. మీరు గొప్పగా చదవండి..మీ చదువులను నేను పూచీ. ప్రతి అక్క, చెల్లెమ్మకు చెబుతున్నాను. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటేఅంత మందిని చదివించండి..నేను చదివిస్తానని భరోసా ఇస్తున్నాను. 
 • ఈ తల్లులందరికీ కూడా ఇంకో చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు బటన్‌ నొక్కి నేరుగా మీ ఖాతాల్లో వేస్తున్న డబ్బును కాలేజీల ఫీజుల కోరకు ఖర్చు చేయండి. పిల్లలు ఎలా చదువుతున్నారో విచారణ చేసి ఆ డబ్బును కాలేజీల్లో చెల్లించండి.
 • విద్య రంగంలో మన ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఈ మూడున్నరేళ్ల పాలనలో ఏ రకంగా శ్రద్ధ చూపుతుంది. తీసుకువచ్చిన మార్పులు ఏంటో నాలుగు మాటల్లో మీకు వివరిస్తాను.
 • పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తలరాతలు మార్చాలని, వారి ఇంటా వెలుగులు నింపాలని మంచి సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చుతున్నాం. పునాదులు బలంగా ఉండాలని, పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలదొక్కునేలా బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాం. సీబీఎస్‌ఈ తీసుకువచ్చాం. బడుల రూపురేఖలు మార్చుతున్నాం. చదివించే తల్లలులకు అండగా నిలుస్తూ..మీ పిల్లలను బడులకు పంపించండి. మీకు జగనన్న అమ్మ ఒడి ద్వారా మీ అన్న, మీ తమ్ముడు తోడుగా ఉంటారని ఆ తల్లులను ప్రోత్సహిస్తున్నాను. దేశంలో ఏ రా్రçష్టంలో కూడా అమ్మ ఒడి లేదు.
 • పిల్లల చదువుల విషయంలో సంస్కరణలు తీసుకువస్తూ..వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మన బడి నాడు–నేడు, సీబీఎస్‌ఈ సిలబస్, బై లివింగబూల్‌ టెక్స్‌›్ట బుక్స్, బైజూస్‌ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు బ్యాబ్స్, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్,
 • పెద్ద చదువుల కోసం మన పిల్లలు ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఉన్నత విద్యరంగంలో కరిక్యూలమ్‌ మార్పు చేశాం. డిగ్రీ చదివే సమయంలో ఇంటర్న్‌షిప్స్‌తీసుకువచ్చాం. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ విత్‌ క్రెడిట్‌ తీసుకువచ్చాం. ఆన్‌లైన్‌లో ఉన్న మంచి కోర్స్‌లు వెతికి పట్టుకుంటున్నాం. వాటిని కూడా  మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. మైక్రోసాప్ట్, ఆమెజాన్‌ ఇలాంటి సంస్థలతో సర్టిఫైడ్‌ స్కిల్స్‌ కోర్సులు తీసుకువచ్చాం. విద్యారంగాన్ని ఉపాధికి చేరువగా తీసుకెళ్తున్నాం.
 • ఈ మూడున్నరేళ్ల పాలనలో గొప్పగా విద్యారంగంలో జరుగుతున్నాయి. కేవలం ఈ మూడున్నరేళ్ల పాలనలోనే ఇన్ని పథకాలు తీసుకువచ్చి..వీటి ద్వారా తెచ్చిన మార్పు ద్వారా మన రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్‌ పట్ల మన ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తోంది. ఈ పథకాలపై  ఇప్పటి వరకు రూ.55 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నాను.
 • జగనన్న అమ్మ ఒడి ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ. 19617 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా రూ. 951 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ.3349 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా రూ. 2368 కోట్లు , 8వ తరగతి ట్యాబ్స్‌ ఇచ్చేందుకు అక్షరాల మరో రూ.685 కోట్లు ఈ డిసెంబర్‌లో ఖర్చు చేస్తున్నాం. జగనన్న గోరు ముద్ద ద్వారా మరో రూ.3,239 కోట్లు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మొదటి దశలో రూ. 3669 కోట్లు, ఈ ఏడాది రెండో దశలో మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు మరో రూ. 4895 కోట్లు, స్వేచ్ఛ కార్యక్రమం కోసం మరో రూ.32 కోట్లు ఖర్చు చేశాం. ఈ మూడున్నరేళ్ల కాలంలో విద్యా రంగంలో రూ.55 వేల కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నా.
 • ఇంత ధ్యాస పెడుతున్నాం కాబట్టే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా 3 లక్షల పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే అందులో కేవలం 37 వేల మందికి మాత్రమే క్యాంపస్‌ రిక్రూమెంట్‌ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు గత ప్రభుత్వంలో చూశాం. ఈ రోజు మన ప్రభుత్వంలో నిరుడు సంవత్సరం అక్షరాల క్యాంపస్‌ ప్లెస్‌మెంట్‌ ద్వారా 85 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని సగర్వంగా చెబుతున్నాను. 
 • నా ప్రసంగం ముగించే ముందు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి రెండు మాటలు చెబుతాను. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదు. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని  ఇవ్వగలుగడమే విద్యకు పరమార్థమని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బల్ట్‌ ఐనిస్టిన్‌ చక్కగా చెప్పారు. 
 • ఈ రోజు రాజకీయ విషయాల్లోకి వస్తే ఈ రోజు కొరబడిన అలాంటి ఆలోచన శక్తి, కొరవడిన వివేకం ప్రతిపక్షాలకు ఎప్పటికైనా రావాలి. పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవకూడదని కోరుకుంటున్న ప్రతిపక్షాల వైఖరి మారాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే అన్న జ్ఞానం వీరందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
 • ఈ రోజు ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయంటే ఫలాన ప్రాంతంలో, ఫలాన పొలాలను ఫలానా రేటుకు అమ్ముకునేందుకు , ఆ భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి వీళ్లందరూ కూడా  బయట పడేలా వీరికి ఆ దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని పంచిపెట్టాలని దేవుడిని కోరుకునే పరిస్థితి ఉంది.
 • ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని వాదించే మెదళ్లను మార్చాలని, వీరికి మంచి ఆలోచనలు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను.
 • నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే ఈ పెత్తాందార్లు తట్టుకోలేకపోతున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కి ప్రజలకు మంచి జరిగితే వీళ్లకు పుట్టగతులు ఉండవు. వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఇదే రాష్ట్రంలో వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అని దుష్ప్రచారం చేస్తూ నిసిగ్గుగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వీరికి ఇంకితజ్ఞానం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.
 • వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు..రైతులను మోసం చేశారు. ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. పిల్లలకు అన్యాయం చేసిన చంద్రబాబు ఈ రోజు విద్యారంగం గురించి మాట్లాడుతున్నాడు. అక్కచెల్లెమ్మలను దగా చేసిన ఈ బాబు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించి, అన్యాయం చేసిన చంద్రబాబు ఈ రోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్లు ఈ రోజు లెక్చర్స్‌ దంచుతుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదేం ఖర్మరా బాబూ..అని అనుకుంటున్నారు.
 • ఇలాంటి కుళ్లిపోయిన పెత్తందార్లమనస్తత్వాలు ఉన్న ఇలాంటి బాబులకు, దత్తపుత్రులకు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేస్తున్న దుష్ప్రచారానికి మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మనే నమ్మొద్దని కోరుతున్నాను.
 • కేవలం ఒక్కటే కొలమానం తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ యుద్ధం చేస్తున్నది మంచి వాళ్లతో కాదు. రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని దయచేసి గుర్తు పెట్టుకోండి.
 • ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రభుత్వమే ఉండేది. ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఒక బడ్జెట్‌ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు ఈ మాదిరిగా నేరుగా బటన్‌నొక్కి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల వచ్చేలా మంచి చేయలేకపోయారో ఆలోచన చేయండి. కారణం..అప్పుడంతా కూడా ఒక గజదొంగల ముఠా ఉండేది. ఆ ముఠాకు దుష్టచతుష్టయం అనే పేరు ఉండేది. అందులో ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, చంద్రబాబు..ఈ దుష్ట చతుష్టయం, గజదొంగల ముఠా..వీరు రాష్ట్రాన్ని దోచుకో..తినుకో..పంచుకో మాదిరిగా దోచుకుతిన్నారు. అందుకే ఆ రోజు బటన్లు లేవు. నొక్కే వారు లేరు. ప్రజలకు నేరుగా మంచి చేయాలనే ఆలోచనలు లేవు. వారు చేసేది దౌర్భాగ్య రాజకీయాలు అయినా ఎవరూ రాయరు. ఎవరు చూపించరు. అలాంటి దౌర్భగ్యా రాజకీయాలతో ఈ రోజు యుద్ధం చేస్తున్నాం. 
 • ఈ రోజు మీ బిడ్డ ఇలాంటి పత్రికలను, టీవీ చానల్స్‌ను నమ్ముకోవడం లేదు. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. దేవుడిని నమ్ముకున్నాను. ఆ తరువాత మిమ్మల్ని నమ్ముకున్నాని తెలియజేస్తున్నారు. మీ బిడ్డకు మీతోనే పొత్తు. మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా టీవీ చానల్స్, పేపర్లు అండగా ఉండకపోవచ్చు. మీ బిడ్డకు దత్తపుత్రుడి తోడు ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు నిజాయితీ తోడుగా ఉంది. ఏదైతే మీ బిడ్డ చెబుతాడో..అదే చేసి చూపిస్తాడు. 
 • ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేశాం. దాన్ని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాను. ఇప్పటికే 98 శాతం హామీలను పూర్తిగా అమలు చేసిన తరువాత ప్రతి ఎమ్మెల్యే మీ ఇంటి గడప వద్దకు వచ్చి ఈ మంచి మీకు జరిగిందా? లేదా అని మీ ఆశీస్సులు తీసుకుంటున్నారు. తేడా గమనించమని కోరుతున్నాను.
 • గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవారు. ఎవరు ఇలా ఎందుకు చేశావని రాసేవారు ఉండేవారు లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకువచ్చింది మీ బిడ్డే అని తెలియజేస్తున్నారు. ఇలాంటి మీ బిడ్డను దేవుడుఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉండాలని, ఈ ప్రభుత్వానికి ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం ఆ దేవుడు మీ బిడ్డకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగ న్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి జగనన్న విద్యా దీవెన డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ  చేశారు. 
 •  

తాజా వీడియోలు

Back to Top