కిడ్నీ రోగికి సీఎం వైయ‌స్‌ జగన్‌ సాయం

రూ.10 లక్షలు మంజూరుపై కుటుంబ సభ్యుల ఆనందం
 

తాడేప‌ల్లి: కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెడన పట్టణం 7వ వార్డుకు చెందిన వాసా కుమార స్వామి, మధులత దంపతుల కుమారుడు రేవంత్‌ కుమార్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌ లోని యశోద ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నాడు.

పట్టణ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యుడు జోగి రమేష్‌.. ముఖ్యమంత్రి కార్యాలయ వైద్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం యశోద ఆసుపత్రికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఎమ్మెల్యే జోగి రమేష్  ఆ బాలుడి కుటుంబానికి అందజేశారు. వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top