పెనుమ‌త్స సురేష్‌బాబుకు బీఫాం అంద‌జేసిన సీఎం

తాడేప‌ల్లి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పెనుమ‌త్స సురేష్‌బాబు పేరు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఖ‌రారు చేశారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, దివంగ‌త పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు కుమారుడు సురేష్‌బాబును అభ్య‌ర్థిగా దించారు. పెనుమ‌త్స సురేష్‌బాబుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ బీఫాంను అంద‌జేశారు. నామినేషన్ దాఖ‌లుకు నేడు చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జ‌రిపి ఫలితాల‌ను వెల్ల‌డిస్తారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top