త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్‌

సీఎం వైయస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు
 

అమరావతి: విత్రమైన బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరసోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్‌’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలంటూ ఆయన పేర్కొన్నారు. 
 

Back to Top