దేశానికే దిక్సూచిగా ‘జగనన్న తోడు’ 

 8వ విడ‌త ‘జగనన్న తోడు’ కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఒక్కొక్కరికి రూ.10 వేలు, అంతకు పైన రూ.13 వేల వరకు వడ్డీ లేని రుణాలు

8వ‌ విడతలో 3,95,000 మందికి రూ.417.94 కోట్లు

5.81లక్షల మందికి రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

పీఎం స్వనిధి ద్వారా ఇచ్చిన రుణాలు రూ.10,220 కోట్లు

ఏపీలో జగనన్న తోడు ద్వారా రూ.3,373 కోట్లు రుణాలు అందించాం

వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది

ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు జమ చేసిన సీఎం వైయ‌స్ జగన్‌

తాడేప‌ల్లి:   నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కు­కొనేలా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జగనన్న తోడు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచింద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నామ‌ని,  రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌న్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి ప్ర‌భుత్వం అండగా నిలుస్తోంద‌ని చెప్పారు.  పూర్తి వడ్డీ భారాన్ని ప్రభు­త్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు అందిస్తున్నామ‌ని చెప్పారు.   మొత్తం 16,73,576 మంది లబ్ధిదారు­ల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారు­లకు రూ.13.64 కోట్లు చెల్లిస్తున్నామ‌న్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం వైయ‌స్‌ జగన్ ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

  • దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. లక్షల మంది చిరువ్యాపారులకు 8వ విడత జగనన్న తోడు కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది. చిరువ్యాపారుల బతుకులు నిత్యం మనం చూస్తునే ఉన్నాం. వీరు వ్యాపారాలు చేసుకునేందుకు పడుతున్న కష్టాలు గతంలో ఎవరూ కూడా ఇంత మనసు పెట్టి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ నా కళ్లెదుట ఇది కనిపించినప్పుడు ప్రతి జిల్లాలోనూ ఇది చూశాను. అప్పు కావాలంటే వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ.1000కి వంద రూపాయలు కట్‌ చేసుకుని ఇచ్చేవారు. సాయంత్రానికే మళ్లీ అసలు చెల్లించేవారు. ఇలాంటి పరిస్థితి దశాబ్ధాలుగా కనిపిస్తున్నా కూడా ఎవరు కూడా వీటికి పరిష్కారం చూపలేదు. మన ప్రభుత్వం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. బ్యాంకర్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఎలాంటి గ్యారేంటిలు లేకుండానే రుణం ఇప్పిస్తున్నాం. ఆ మొత్తం సకాలంలో చెల్లిస్తే ఆ వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇవన్నీ కూడా చేస్తూ ఈ రోజు 8వ దఫా కింద ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం.మరో 86.80 వేల మందికి మంది చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం.దీనితో పాటు రూ.330 కోట్లు రెన్యువల్‌ చేస్తున్నాం. 3.90 లక్షల మదికి ఈ రోజు రుణాలు ఇస్తున్నాం.
  • గతంలో జగనన్న తోడు స్కీమ్‌ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 5,80,960 మంది లబ్ధిదారులకు వడ్డీ రూ.14.60 కోట్లు తిరిగి ఇస్తున్నాం. దాదాపుగా రూ.430 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నాం.
  • చివరి ఏడు విడతల్లో జగనన్న తోడు కార్యక్రమంతో పాటు 8వ విడతను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు 16,73,580 చిరువ్యాపారులకు వడ్డీ  చెల్లించాం. గొప్ప అడుగులు పడ్డాయని చెప్పడానికి సంతోషపడుతున్నాను.
  • ఈ స్కీమ్‌ ద్వారా లబ్ధిపొందిన వివరాలు గమనిస్తే..73,070 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు తీసుకొని చెల్లించారు. 5.10 లక్షల మంది మూడుసార్లు డబ్బులు తీసుకొని చెల్లించారు. మరో 3,98,226 మంది చిరువ్యాపారులు రెండుసార్లు రుణాలు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా చిరువ్యాపారులు, హస్తకళాకారులు, పుట్‌ఫాత్‌ అమ్మకాలు చేసేవారు, వీధి వ్యాపారులు, రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించుకునే వారు, ఆటోలు, సైకిళ్లపై అమ్ముకునే వారు..ఇలా వివిధ వృత్తుల కళాకారులు బతకడమే కాకుండా మరి కొంత మందికి ఉపాధి చూపుతున్నారు.  మొదటి ఏడాది ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.10 రుణం ఇప్పించడమే కాకుండా ప్రతి ఏటా రూ.1000 పెంచుతూ..దాన్ని రూ.13000లకు పెంచాం. 
  • ఇంకా కొన్ని విషయాలు సంతోషాన్ని కలిగించే విషయాలు గమనిస్తే..ఇందులో 87.13 శాతం నా అక్కచెల్లెమ్మలు లబ్ధి పొందారు. మహిళా సాధికారతలో మరో విప్లవమని చెప్పవచ్చు. 16.73 లక్షల మందిలో 79.14 శాతం మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలే ఉన్నారు. ఇది కూడా సాధికారతలో మరో విప్లవం అని చెప్పవచ్చు.
  • దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎంతో పుస్‌ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్రంలో 58.63 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో ఇస్తే..మన రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు. రూ.10,220 కోట్లు కేంద్రం ఇస్తే..మన రాష్ట్రంలో రూ.3,337 కోట్లు ఇచ్చాం. మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయి. అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చే 7 శాతం రుణాలు ఇస్తుంటే..మన ఒక్క రాష్ట్రమే 88 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాం. మన వద్ద ఉన్న సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థతోనే ఇదంతా సాధ్యమైంది. పారదర్శకంగా రుణాలు ఇప్పించగలుగుతున్నాం. అదేవిధంగా వాళ్లు రుణాలు చెల్లించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడింది. రుణాల రికవరీ 90 శాతం పైగానే ఉంది. 
  • పొదుపు సంఘాలు మన ప్రభుత్వం రాకముందు 18 శాతం రుణాలు అవుట్‌ స్టాండింగ్‌లో ఉండేవి. ఇప్పుడు మైనస్‌ 3 శాతం ఉంది. ఎంత పారదర్శకత ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇవన్నీ గొప్ప అడుగులు.
  • దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని, లబ్ధిదారులకు ఇంకా మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ జగనన్న తోడు కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. 

తాజా వీడియోలు

Back to Top