ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు సీఎం అభినందనలు

అమరావతి: ప్రపంచ ఆర్చరీ పోటీల్లో జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ మేరకు ట్విట్‌ చేశారు.

కాగా,  నెదర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఘనంగా సన్మానించారు.   

Back to Top