ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబుకి భయం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

చంద్రబాబు ఈర్ష్యతో ఏం చేస్తున్నారో సభ చూస్తోంది

చారిత్రాత్మక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాం

నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు

వైయస్‌ఆర్‌ చేయూత పథకం సెప్టెంబర్‌3, 2018న ప్రకటించాం

అమరావతి: చారిత్రాత్మక బిల్లులు సభలో ప్రవేశపెడుతుంటే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని చంద్రబాబుకు భయం పట్టుకుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్లకే పింఛన్, వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేయడాన్ని సీఎం తప్పుపట్టారు. వాస్తవాలు వక్రీకరించి ప్రతిపక్ష సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నిన్నటి  నుంచి గమనిస్తున్నాను. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు సంబంధించిన చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెడుతుంటే..ఎక్కడ మంచి పేరు ఈ ప్రభుత్వానికి వస్తుందనే ఆక్రోశం, ఈర్షతో చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోతున్నారో నిన్నటి నుంచి చూస్తే తెలుస్తుంది. టీడీపీ నేతలు చూపిస్తున్న పేపర్‌ 18.10.2017కు సంబంధించిన పేపర్‌ ఇది. సెప్టెంబర్‌ 3వ తేదీ 2018న విశాఖలో పాదయాత్ర జరుగుతుండగా ముత్యాలనాయుడుకు చెందిన నియోజకవర్గంలోని కే.కోటపాడులో వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రకటించాను. పాదయాత్ర జరుగుతుండగా ప్రజల సమక్షంలోనే ఎటువంటి పరిస్థితిలోనే ఈ ప్రోగ్రామ్‌ను మార్చామన్నది చెప్పాను. పాదయాత్రలోనే పది మీటింగ్స్‌లో చెప్పాను. ఎన్నికల ప్రచార సభలో ప్రతి చోటా చెప్పాను. వైయస్‌ఆర్‌ చేయూత గురించి మేనిఫెస్టోలో చేర్చాము. ఆ తరువాత ప్రజలను ఓట్లు అడిగాను. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీ గురించి ఆలోచించలేదు. మేం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలపై మొట్టమొదటి సభలోనే చట్టాలు తీసుకువస్తున్నాం. చారిత్రాత్మకంగా దేశంలోనే ఎక్కడా జరగని విధంగా 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం.

నామినేషన్‌ పనుల్లోనే కాదు, పదవుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మహిళలకు సంబంధించిన 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్‌ ఉండేలా బిల్లు తెచ్చాం. స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ బిల్లులను ఎలా అడ్డుకోవాలి? ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే దుర్భుద్ధితో నిన్నటి నుంచి ఇదే కార్యక్రమం జరుగుతోంది. చంద్రబాబు చూపిస్తున్న పేపర్‌ కటింగ్‌ 2017 నాటిది. సెప్టెంబర్‌ 3, 2018 నాటి సభలో వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం గురించి చెప్పిన మాటలు వీడియో క్లిప్పింగ్‌లు చూపించి చంద్రబాబు డొల్లతనం, అన్యాయాన్ని వైయస్‌ జగన్‌ ఎండగట్టారు. ఇంత స్పష్టంగా చెప్పినా కూడా, వక్రీకరణకు తావు లేని అంశంపై కూడా వక్రీకరించేందుకు ఏకంగా సభా సమయాన్ని పూర్తిగా వృథా చేస్తూ ఎటువంటి చర్చలకు తావులేకుండా చేస్తూ రాజకీయ లబ్ధి కోసం స్వార్థంగా ఆలోచన చేసే ఇటువంటి పెద్దమనిషి చంద్రబాబు ఈ సభలో ఉండటం నిజంగా బాధపడాల్సిన అంశం. గంటన్నరపై ఒకే అంశంపై టీడీపీ ఆందోళన చేస్తోంది..ఇప్పటికేనా ఈ అంశంపై ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ స్పీకర్‌ను కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top