11వ రోజు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర షెడ్యూల్‌

ప‌ల్నాడు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 11వ‌ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది. ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం సీఎం వైయ‌స్‌ జగన్ బస్సుయాత్ర బ‌య‌ల్దేర‌నుంది.  వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్‌ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. 

Back to Top