9వ రోజు `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర ప్రారంభం 

నెల్లూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 9వ‌ రోజు భారీ జ‌న‌సందోహం మ‌ధ్య అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బ‌స్సు యాత్ర క‌దిలింది. గ్రామ‌స్తులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. బ‌స్సు యాత్ర కొవ్వూరు క్రాస్ , సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంటుంది. ఆర్ఎన్ఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ వ‌ద్ద భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస చేసే ప్రాంతానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు.

Back to Top