కాసేప‌ట్లో పార్టీ ఎంపీలతో  సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

తాడేప‌ల్లి: వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఉదయం 11 గంటలకు తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో భేటీ కానున్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలో సీఎం దిశానిర్దేశం చేస్తారు.

కేంద్రం ఇవ్వాల్సిన నిధులను రాబట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైయ‌స్సార్‌సీపీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా ఎంపీల సమావేశంలో చర్చించే వీలుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.    

Back to Top