గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భేటీ 

11న‌ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరిన వైయ‌స్ జ‌గ‌న్ 
 

విజయవాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.  ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్‌తో సీఎం జగన్‌ చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును సీఎం జగన్‌ గవర్నర్‌కి వివరించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ను కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రాజ్ భవన్ వద్ద సీఎం వైయ‌స్ జగన్‌కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.

తాజా వీడియోలు

Back to Top