కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: లాక్‌డౌన్‌ విధింపు కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించేందుకు మరిన్ని విమాన సర్వీసులు నడపాలని కేంద్ర విదేశాంగ శాఖను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం వైయస్‌ జగన్‌ గురువారం లేఖ రాశారు. గల్ఫ్, సింగపూర్‌ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని, వారందరినీ స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు. 
 

Back to Top