సాలూరు బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

మ‌రికాసేప‌ట్లో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం నుంచి విశాఖకు బయల్దేరారు. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా సాలూరుకు చేరుకుంటారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో నూతనంగా నిర్మించనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. 
 

Back to Top