కుప్పం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం పర్యటనకు బ‌య‌ల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం గ‌న్న‌వ‌రం చేరుకున్నారు. అక్క‌డి నుంచి రేణిగుంట‌ ఎయిర్‌పోర్టుకు బ‌య‌ల్దేరారు. రేణిగుంట నుంచి కుప్పంకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో కుప్పంలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైయ‌స్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్య‌క్ర‌మం అనంత‌రం కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభిస్తారు. 

Back to Top