శ్రీ‌కాకుళం బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకుని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దిస్తారు. శ్రీ‌కాకుళం ప‌ర్య‌ట‌న అనంతరం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేర‌నున్నారు. సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసానికి చేరుకొని.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై ఇరు ముఖ్య‌మంత్రులు చర్చిస్తారు. రాత్రి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు. 

తాజా ఫోటోలు

Back to Top