ఒంటిమిట్ట‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఒంటిమిట్ట శ్రీ‌కోదండ రామాల‌యానికి బ‌య‌ల్దేరారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్డు నుంచి క‌డ‌ప విమానాశ్ర‌యానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట కోదండ రామాల‌యంలో శ్రీ‌సీతారామ క‌ల్యాణోత్స‌వానికి బ‌య‌ల్దేరారు. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ను దర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం అక్కడ నుంచి నేరుగా స్వామివారి కల్యాణ వేదికకు చేరుకుంటారు. స్వామివార్ల‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. రాత్రి కడపలో సీఎం బస చేస్తారు.

ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైయ‌స్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.

తాజా వీడియోలు

Back to Top