6 లక్షల ఉద్యోగాల క‌ల్ప‌న‌ దిశగా అడుగులు వేస్తున్నాం

కొత్త పరిశ్రమలకు సీఎం వైయ‌స్ జగన్‌ శంకుస్థాపన

రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సీఎస్ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం

ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాల క‌ల్ప‌న‌ దిశగా అడుగులు వేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు. 

 5 పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభించిన సీఎం. 

1.
ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ముత్తుకూరు మండలం, దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్‌ ఆగ్రో రిసోర్సర్‌ లిమిటెడ్‌ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్లాంట్‌ ప్రారంభం. 
1150 మందికి ఉద్యోగాలు, 
ఏడాదికి 4.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం.

2. 
రూ.144 కోట్లతో శ్రీ వేంకటేశ్వర బయోటెక్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ పనులకు సీఎం శంకుస్థాపన.
ఏలూరు జిల్లా అగిరిపల్లె మండలం కొమ్మూరు గ్రామం వద్ద నిర్మాణం కానున్న పరిశ్రమ. 
310 మందికి ఉద్యోగావకాశాలు. 
మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ.
ఏడాదికి 90వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి. 
వేలమంది రైతులకు ఉపయోగం.

3. 
రూ.13 కోట్లతో బ్లూఫిన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పనులు సీఎం శంకుస్థాపన.
45 మందికి ఉద్యోగావకాశాలు. 
3600 మెట్రిక్‌ టన్నుల గోధుమ, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్‌ టన్నుల పొటాటో ఉత్పత్తులు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద కంపెనీ. 
ఈ ప్రాంత రైతులకు ఉపయోగకరం. 

4. 
కర్నూలుజిల్లా పత్తికొండ వద్ద టొమాటో ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులకు సీఎం శంకుస్థాపన.
రూ.12 కోట్ల పెట్టుబడి.
ఏడాదికి 3600 మెట్రిక్‌ టన్నుల టమాటో ఉత్పత్తులు.
ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌కు అప్పగించనున్న ప్రభుత్వం.
వారిద్వారా లీజు ప్రాతిపదికన నిర్వహణలో మంచి సమర్థత ఉన్న కంపెనీకి అప్పగింత.
పత్తికొండలో వందలామంది రైతులకు ఉపయోకరం.
టమోట ధరల స్థిరీకరణకు సహాయపడనున్న పరిశ్రమ. 

5. 
విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద సెసమీ ప్రాససింగ్‌ యూనిట్‌.  
ప్లాంట్‌ను ఏర్పాటుచేసిన ఏపీఎఫ్‌పిఎస్‌. 
ఎల్‌.కోట జైకిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌కు ఈ ప్లాంటును అప్పగించిన ప్రభుత్వం. 
నువ్వుల నూనె, చిక్కీల ఉత్పాదన.
రూ.2.5 కోట్ల పెట్టుబడి.
20 మందికి ఉద్యోగాలు.
ఏడాదికి 600 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి.
స్థానిక రైతులకు ఉపయోగకరంగా యూనిట్‌. 


పరిశ్రమల శాఖ నుంచి మరో నాలుగు కంపెనీలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి. 

1.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్‌ గొట్టిపాడు వద్ద ఫార్మా (ఏపీఐ) యూనిట్‌ఏర్పాటు చేయనున్న సిగాచి ఇండస్ట్రీస్‌. శంకుస్థాపన చేసిన సీఎం.
రూ.280 కోట్ల పెట్టుబడి, 850 మందికి ఉద్యోగాలు.
ఏడాదికి 72వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి.

2.    
కర్నూలు జిల్లా ఓర్వకల్‌ నోడ్‌ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌.
ఇండస్ట్రీ ఏర్పాటు పనులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన.
రూ.90 కోట్ల పెట్టుబడి, 285 మందికి ఉద్యోగాలు.
ఏడాదికి 4,170 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి.

3.    
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు చేసిన సీఎం. 
రూ.286 కోట్ల పెట్టుబడి.
ఈ కాంప్లెక్స్‌ ద్వారా రూ.1785 కోట్ల పెట్టుడులకు అవకాశం, తద్వారా  18,034  మందికి ఉద్యోగాలు.

4.    
కాకినాడ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ప్రింటింగ్‌ క్లస్టర్‌లో కామన్‌ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం. 
రూ.15 కోట్లు ఖర్చుచేసిన పరిశ్రమలశాఖ.
ఈ సెంటర్లలో 1000 మందికి ఉద్యోగాలు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. పారిశ్రామిక రంగంపైనా ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ సెక్టార్, పుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. 

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మనం దాదాపుగా 386 ఎంఓయూలు చేసుకున్నాం.  తద్వారా రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. వీటి వల్ల 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం.వీటన్నింటినీ చేయిపట్టుకుని నడిపిస్తూ... ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం.

ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలినవి మరికొన్ని పనుల ప్రారంభదశలో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి తీసుకొచ్చేందుకు సీఎస్‌ గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. 
నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయి. ఇవన్నీ వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి.
ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలి. దీన్ని కూడా వేగవంతం చేయాలి. 

ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం.
అదే విధంగా ఎంఎస్‌ఎంఈ సెక్టార్లో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్‌ సమయంలో కూడా ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూత నిచ్చాం. నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యింది.
పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం తరపునుంచి మనం ఇవ్వగలిగిన మెసేజ్‌ ఏమిటంటే... మనం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నామని చెప్పాలి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా  మేము కేవలం ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నాం అన్న ఈ మెసేజ్‌ను ఎంత సానుకూలంగా తీసుకుపోగలిగితే అంత సానుకూలంగా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంతో ముందుకు వస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఈ రకమైన తత్వం ఇమిడించుకోవాలి. అదే మాదిరిగానే అడుగులు వేయించగలిగాం. అవన్నీ చేస్తూనే దేవుడి దయతో మనం ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేశాం.

పరిశ్రమలు, వాణిజ్యశాఖ, పుడ్‌ ప్రాసెసింగ్‌ రెండు విభాగాల్లోనూ 9 ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ. 1100 కోట్ల పెట్టుబడి, 21,744 మందికి  ఉద్యోగాలు వచ్చే మంచి అడుగు పడుతుంది. 9 ప్రాజెక్టులకు గాను 3 ప్రాజెక్టులు ప్రారంభ కార్యక్రమం, మిగిలిన 6  ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేసుకుంటున్నాం. 

పత్తికొండలో టమోట ప్రాసెసింగ్‌ యూనిట్‌కు సంబంధించి కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండకు వెళ్లినప్పుడు... ఈ యూనిట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పాను. కొద్ది కాలంలోనే అధికారులు కృషితో ఇవాళ అది కార్యరూపం దాల్చి... శంకుస్ధాపనకు వచ్చింది. రూ.12 కోట్ల పెట్టుబడితో టమోడ పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు పత్తికొండలో శంకుస్ధాపన చేసుకున్నాం. ఇదే మాదిరిగానే  ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. 
ఇవాళ శంకుస్ధాపన, ప్రారంభ కార్యక్రమం జరుపుకుంటున్న ఈ 9 యూనిట్లు అన్నింటికీ మరొక్కసారి ఆల్‌ది బెస్ట్‌ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నాను.  మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.
ఎంఎస్‌ఎంఈ రంగంలో అందరికీ కూడా ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం అని స్పష్టం చేస్తూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Back to Top