‘వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల కోసం రూ.1863 కోట్లు ఖర్చుచేయబోతున్నామని వివరించారు. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించనున్నామన్నారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు, పిల్లల్లో ఎదుగుదల, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదని ఈ పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top