నీటి క‌ష్టాలు తీర్చేందుకు వైయ‌స్ఆర్‌-వేదాద్రి ఎత్తిపోత‌ల‌కు శ్రీ‌కారం

ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రిమోట్ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న 

తాడేప‌ల్లి:  కృష్ణా జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక అయిన వైయ‌స్ఆర్‌- వేదాద్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని 2021 ఫిబ్ర‌వ‌రి క‌ల్లా పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని వైయ‌స్ఆర్ వేదాద్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైలాన్ ఆవిష్క‌రించి, శంకుస్థాప‌న చేశారు.  ఈ ఎత్తిపోత‌ల‌తో జగ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని బీడు భూములు స‌స్య‌శ్యామ‌లం కానున్నాయి.   జ‌గ్గ‌య్య‌పేట‌లో 8 గ్రామాల‌కు, వ‌త్స‌వాయి మండ‌లంలో 10 గ్రామాల‌కు, పెనుమంచిప్రోలు గ్రామంలో 10 గ్రామాల్లో 38,607 ఎక‌రాలు సాగులోకి రానున్నాయి. ప్ర‌జ‌ల‌కు తాగునీటి క‌ష్టాలు తీర‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

చిర‌కాలం గుర్తుంటుంది..

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం విజ‌య‌వాడ‌కు అతి స‌మీపంలోని కృష్ణా జిల్లాలోని నందిగామ‌, వాత్స‌వాయి, పెనుగ్రంచిపోలు, జ‌గ్గ‌య్య‌పేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి క‌ట‌క‌ట‌గా ఉంది. మ‌న క‌ళ్లేదుటే క‌నిపిస్తున్నా..ఐదేళ్లు అధికారంలో ఉన్న కూడా ప‌ట్టించుకోలేదు. ఈ రోజు మ‌నం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే..14 నెల‌ల కాలంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేయ‌డం..ఫిబ్ర‌వ‌రి 2021 క‌ల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్న దృఢ‌సంక‌ల్పంతో ఈ కార్య‌క్ర‌మానికి ఈ రోజు శ్రీ‌కారం చుడుతున్నాం. నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాల్వ‌కు ఈ ప్రాంతానికి నీరు అంద‌క‌పోవ‌డంతో ఈ ప్రాంతానికి 38,607 ఎక‌రాల‌కు నీరు ఇచ్చేందుకు, పీబీఆర్ బ్రాంచ్ కెనాల్ ప‌రిధిలోని 30 గ్రామాల‌కు, జ‌గ్గ‌య్య‌పేట మున్సిపాలిటీకి మంచినీరు అందించేందుకు వైయ‌స్ఆర్‌-వేదాద్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఈ రోజు ఇక్క‌డి నుంచి శంకుస్థాప‌న చేస్తున్నాం. దాదాపుగా 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాల‌న్న ల‌క్ష్యంతో రూ.400 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వ‌ల్ల మంచి జ‌ర‌గాల‌ని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి క‌ష్టాలు తీరి ఈ ప్రాంతానికి అన్ని ర‌కాలుగా మంచి జ‌ర‌గాల‌ని, దేవుడిని కోరుకుంటూ, రైతుల‌కు మంచి జ‌ర‌గాల‌ని మ‌న‌సారా కోరుకుంటూ..ఈ అవ‌కాశాన్ని నాకు అనుగ్ర‌హించిన దేవుడికి కృత‌జ్క్ష‌త‌లు తెలుపుకుంటూ సెల‌వు తీసుకుంటున్నా..ఆల్ దీ బెస్ట్‌..ఈ రోజు మా పెళ్లి రోజు.. ఈ ప్రాజెక్టును మొద‌లుపెట్టాం కాబ‌ట్టి..చిర‌కాలం గుర్తుంటుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top