ఇది మీ మేనమామ ప్రభుత్వం  

విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం

నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం

అంగన్‌వాడీలను చదువుల కేంద్రంగా మార్చాం

బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం

44.32 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు 

విజయవాడ:  పిల్లల పోషణ, సంరక్షణ, చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని, ఇది మీ మేనమామ ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకోవాలన్న ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 44.32 లక్షల మంది  విద్యార్థులకు విద్యా కానుక కిట్లు రూ.650 కోట్ల ఖర్చుతో అందజేస్తున్నామని చెప్పారు. ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు..ఆయన ఏమన్నారంటే..

జగనన్న విద్యా కానుక  కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మనసారా కృతజ్ఞతలు లె లుపుతూ ముందడుగు వేస్తున్నాను. నోబల్‌ బహుమతి పొందిన ఇన్‌సెంట్‌ జాయి అనే పెద్ద మనిషి అన్న మాటలు గుర్తు చేస్తూ..అలాగే నెల్సన్‌ మండెలా మాటలను ఉదహరిస్తూ.. చదువు అన్నది ఒక ఆయుధం లాంటిదని, ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకే ఉందన్నారు. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలంటే విద్యా రంగంలో సమూలమైన మార్పులు రావాలి. ఇందుకోసమే చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వారందరూ కడా వారి వారి మనసాక్షిని అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే తరతరాలను మార్చే ఆస్తి అన్నది అందరికీ తెలుసు. దానికి ఆ శక్తి ఉందని ఆవగాహన ఉంది. ఎవరైనా కూడా తమ పిల్లలను గొప్పగా చదవించాలని ఆశ పడుతుంటారు. ఎన్నో కలలు కంటుంటారు. తమ పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతున్నారని పాలకులు ఆలోచించడం లేదు. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. గతంలో ఎవరూ కూడా ఇలా ఆలోచన చేయలేదు.

స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అయినా కూడా చదువు రాని వారు మన మధ్య ఉన్నారు. అందుకే ఈ రోజు ఆ దిశగా  అడుగులు వేస్తూ పరిస్థితి మార్చే ఆలోచన చేస్తున్నాం. ఇంగ్లీష్‌చదువులు చదవాలంటే ఖరీదైంది. ఈ పరిస్థితులు మారినప్పుడే పిల్లలను చదవించే కార్యక్రమం ముందుకు సాగుతుంది. అంగన్‌ వాడీ నుంచి మొదలుపెడితే..ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని సగర్వంగా చెబుతున్నాను. అందులో భాగంగా ఈ రోజు మరో పథకాన్ని ప్రారంభిస్తున్నాం. మన బడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నాం. మీ అందరి కళ్లేదుటే కనిపిస్తున్నాయి. కరెంట్, ట్యూబ్‌లైట్లు, మంచినీళ్లు ఉన్న స్కూళ్లు, గ్రీన్‌బోర్డులు, పిల్లలు, టీచర్లు కూర్చునేందుకు మంచి పర్నీచర్, బల్లలు, మంచి మరమ్మతులు చేయించాం. మంచి పెయింటింగ్‌లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశాం.  తినడానికి గోరుముద్దు వంటిపథకాన్ని ప్రారంభించాం. మంచి కిచెన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి పేదవాడికి ఇంగ్లీష్‌ మీడియం చదువులు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేశాం. ఇందులో భాగంగా విద్యా కానుకకు శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు పెద్ద స్కూళ్లకు వెళ్లే పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు కూడా మంచి యూనిఫాం, మంచి స్కూల్‌ బ్యాగ్, షూష్, స్కాక్స్‌లు, పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందజేస్తున్నాం. జగనన్న విద్యా కనుక అందజేస్తున్నాం.

1 నుంచి 10వ తరగతి వరకు చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందజేస్తున్నాం. నవంబర్‌ 2న బడులు తెరవాలనుకుంటున్నాం. బడులు తెరవకముందే ఈ కిట్లు అందజేస్తున్నాం. 42,34 లక్షల మంది పిల్లలకు దాదాపుగా రూ.650 కోట్లతో విద్యా కానుక అందజేస్తున్నాం. కుట్టు కూలీకి అవసరమైన డబ్బులతో పాటు మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, బెల్ట్, షూస్, సాక్స్‌లు, బ్యాగ్‌ అందజేస్తున్నాం. కోవిడ్‌ కారణంగా సూచనలు పాటిస్తూ మూడు రోజుల పాటు మూడు దఫాలుగా విద్యార్థులకు కిట్లు అందజేస్తున్నాం. బడి పిల్లలంతా కూడా గర్వ పడేలా ఈ కిట్లు అందజేస్తున్నాం. జగన్‌ మామ ముఖ్యమంత్రి అయ్యాక మా బడులు మారుతున్నాయి. గొప్పగా చదువుకుంటున్నామని చెప్పుకునే రోజులు వచ్చాయని చెన్పగలను. ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ చదవాలి. మన పిల్లలు ఉన్నత విద్యలు చదవాలి. ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రపంచమంతా రావాలి. ప్రతి పిల్లాడు గొప్పగా ఇంగ్లీష్‌ చదువులు చదవగలిగితేనే మనం, మన తలరాతలు కూడా మారుతాయి. అందుకు అవరోధాలు ఎంటో తెలుసు కాబట్టి..విద్యారంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం. తలరాతలు మార్చేందుకు తపన, తాపత్రయంతో  ఉమందడుగు వేస్తున్నాం.

పిల్లలలను బడికి పంపించే విధంగా ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టాం. 1 నుంచి ఇంటర్‌ వరకు చదివించేందుకు ప్రతి చెల్లెమ్మకు దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకు మేలు చేసేలా రూ.15 వేల చొప్పున అందజేశాం. ప్రతి ఏటా జనవరి 9వ తేదీన మరోసారి అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం. పిల్లలకు పోషణ, సంరక్షణ, చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. ఇది మీ మేనమామ ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నా. అమ్మ కడుపులో పడిన బిడ్డ నుంచి అమ్మకు, పేదింటి తల్లులకు పౌష్టికాహారం అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. ప్రతి ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తూ వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంగన్‌వాడీలను మార్చుతూ ఇంగ్లీష్‌ చదువులతో పాటు మానసిక వికాసం పెంచుతూ..వైయస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చుతున్నాం. ఆరు ఏళ్ల వయసు వచ్చే సరికి మెదడు 85 శాతం తయారు అవుతుందట. అప్పటికే పిల్లలకు గట్టి పునాది పడితే..ఆ తరువాత మెదడు ఇంకా చురుగ్గా పని చేస్తుంది. అందుకే ఈ మార్పుకు శ్రీకారం చుడుతున్నాం. పిల్లాడు తింటున్న భోజనం నుంచి తల్లులకు పౌష్టికాహారం అందుతుందా అని ఆరాటపడుతున్నా.

1వ తరగతి నుంచి పిల్లలు స్కూల్‌ బాట పడుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో మంచిరకమైన ఆహారం అందిస్తున్నాం. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా రోజుకోరకమైన మెనూతో ఆహారం అందిస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా ఆలోచించి ఉండరేమో..ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏం తింటున్నారో ఆలోచన చేశాడు. పిల్లలకు తినే తిండిలో మార్పు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇంటర్‌ మీడియట్‌ తరువాత పిల్లలు చదువులు మానేయకూడదు. లక్షల్లో ఫీజులు కట్టలేక చదువులు ఆగకూడదు. మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలి. పిల్లలకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యా దీవెన పథకంతో పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించడమే కాకుండా చదువుల క్వాలిటీని పర్యవేక్షిస్తోంది. కరికూలమ్‌లో కూడా మార్పులు చేస్తున్నాం. పెద్ద పెద్ద చదువులు చదివేందుకు హాస్టల్‌లో ఉండేవారికి అయ్యే ఖర్చుల కోసం ఏడాదికి రెండు ధపాలుగా రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వసతి దీవెన కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టాం. నవంబర్‌ నెలలో రెండో దఫా డబ్బులు జమా చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యం ఎలా ఉందనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా మెడకల చెకప్‌ కోసం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాం. కళ్లజోళ్లు కూడా ఇచ్చాం. కోవిడ్‌ వల్ల కొంత మందికి అందలేదు. స్కూల్‌ తెరిచే నాటికి అందరికి కళ్లజోళ్లు అందించాలని ఆదేశించాం. శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తాం.

అందరికి ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నా..మన ప్రభుత్వానికి మనసుంది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ఉన్నత చదువులు చదివే వరకు పిల్లల మేనమామగా అండగా ఉంటాను. అమ్మ ఒడి, నాడు–నేడు, గోరుముద్ద, కంటి వెలుగు, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు పుట్టిన బిడ్డ రేపు ప్రపంచంలో సగర్వంగా నిలిచేలా, ప్రధానంగా పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంచి జరగాలని, వారందరి కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నా..ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్పగా ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా చేసేలా, అందరికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా...
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top